అనారోగ్యంతో డిగ్రీ విద్యార్థి మృతి..!
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డివారిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తేజశ్రీ (18) అనారోగ్యంతో బుధవారం మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అనారోగ్యంతో డిగ్రీ విద్యార్థి మృతి..!
రామసముద్రం, మనసాక్షి:
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చెంబకూరు గ్రామపంచాయతీ పరిధిలోని వడ్డివారిపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తేజశ్రీ (18) అనారోగ్యంతో బుధవారం మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన రామచంద్ర, కళావతమ్మ (జెడ్పీ హైస్కూల్ చైర్మన్) దంపతుల కుమార్తె తేజశ్రీ మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ తొలి సంవత్సరం చదువుతోంది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది.
కుమార్తె మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామస్థులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బాగా చదివి ఉన్నత ఉద్యోగం సాధిస్తుందని ఆశించిన తమ కూతురు అకాల మరణం తీరని లోటని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. తోటి విద్యార్థులు తేజశ్రీ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, మంచి స్నేహితురాలిని కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు.









