Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఇక ఏఐ సాంకేతికత..!

హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు.

Hyderabad : హైదరాబాద్ ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఇక ఏఐ సాంకేతికత..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

హైదరాబాద్ మహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా సిగ్నల్స్ పనిచేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలకు సూచించారు.

అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్‌మాన్, మెగా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ రెండు సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో దేశంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇంటిగ్రేట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో అనుసంధానం చేయాలని చెప్పారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యంత్రాల ద్వారా వాస్తవిక పరిస్థితులను గ్రహించడం, పరిస్థితులను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా చర్యలు తీసుకునే సామర్థ్యం కలిగిన ఫిజికల్ ఇంటెలిజెన్స్ విధానాన్ని అనలాగ్ ప్రతినిధులు ఈ సమావేశంలో వివరించారు. ఈ విధానం ముందుగా నిర్దేశించిన ప్రోగ్రామింగ్‌పై ఆధారపడకుండా, నిరంతర అభ్యాసం ద్వారా స్వయంగా అభివృద్ధి చెందే వ్యవస్థ అని వివరించారు.

నగరంలో ఎదురయ్యే సమస్యలకు సత్వర పరిష్కారానికి దోహదపడే ఈ సాంకేతిక వ్యవస్థ పూర్తిగా నెక్స్ట్ జనరేషన్ ఇంటెలిజెన్స్ సదుపాయమని పేర్కొంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పైలట్ ప్రాజెక్టు వివరాలు, వాటి ప్రయోజనాలను సమావేశంలో తెలిపారు.

సెన్సర్లు, రోబోటిక్స్ వంటి ఫిజికల్ ఇంటెలిజెన్స్ వినియోగం ద్వారా సురక్షితమైన, సమర్థవంతమైన, వేగంగా స్పందించే పట్టణ రవాణా వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఏ రకంగా తోడ్పుతుందన్న అంశాలను తెలిపారు.

ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని గుర్తించి తదనుగుణంగా సిగ్నళ్ల వ్యవస్థ, ఇతర లీకేజీలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం, అవసరానికి అనుగుణంగా విద్యుత్ వినియోగాన్ని నిర్వహించడం, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకు మార్గం సుగమం చేయడం వంటి కాగ్నిటివ్ సిటీస్ (Cognitive Cities) రూపకల్పనకు ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు.

ఈ ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై అనలాగ్ సంస్థకు, ఎంఈఐఎల్‌కు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి సమక్షంలో సంస్థలు పరస్పరం అందజేసుకున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా అనలాగ్ ప్రాథమికంగా ఈ మేరకు అంగీకారం తెలిపింది.

మరిన్ని వార్తలు