Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణ

Breaking News : టాప్ 10.. మన సాక్షి 02/07/2026 బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తుంది. ఈరోజు టాప్ టెన్ బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

Breaking News : టాప్ 10.. మన సాక్షి 02/07/2026 బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి బ్రేకింగ్ న్యూస్ ఎప్పటికప్పుడు పాఠకులకు అందిస్తుంది. ఈరోజు మార్నింగ్ (02/07/2026 )టాప్ టెన్ బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం :

భద్రాచలం గోదావరి బ్రిడ్జి పైనుండి నదిలోకి దూకిన యువతి. బ్రిడ్జి పైనుండి దూకిన యువతిని కాపాడిన నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్ల. ప్రస్తుతం యువతి ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. ఘటనపై విచారణ చేస్తున్న భద్రాచలం పోలీసులు.  యువతి ఎవరు? ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది.

—– ——

వర్షం ఎఫెక్ట్..
ముంబై రైల్వేస్టేషన్లలో భారీ రద్దీ

ముంబైలో లోకల్ రైళ్ల ఆలస్యం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. రైళ్లు కేవలం 30 నిమిషాలు లేటుగా నడవడం వల్ల బోరివళి స్టేషన్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలంలో కూడా రైళ్లు సజావుగా సాగేలా ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

—–

నడి రోడ్డుపై కారును వెంబడిస్తూ హల్చల్ చేసిన పోకిరీల అరెస్ట్ :

హైదరాబాద్ నగర శివారులోని ఘట్కేసర్ నుండి బోడుప్పల్ హైవే మీద అర్ధరాత్రి వేళ పెళ్లికి వెళ్లి కారులో వస్తున్న కుటుంబాన్ని బైక్‌లపై వెంబడిస్తూ, భయబ్రాంతులకు గురిచేసిన పోకిరీలు. బైక్‌లను కారుకు అడ్డంగా తిప్పుతూ, కేకలు వేస్తూ భయపెట్టే ప్రయత్నం చేసిన యువకులు.
భయబ్రాంతులకు గురైన కారులోని మహిళలు, చిన్నారులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులు భువనగిరి మండలం హన్మాపురానికి చెందిన రంగ శివ(21), అఖిల్(20)లుగా పోలీసుల గుర్తింపు. నిందితులను అరెస్ట్ చేసి బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

——-

వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌కు బ్రేక్ :

ఈ ఫీచర్ వల్ల ప్రమాదం పొంచి ఉందని మెటా సంస్థకు నోటీసులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. 3 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అప్పటివరకు ఈ ఫీచర్ ప్రారంభించొద్దని ఆదేశాలు. నంబర్ షేర్ చేయకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా సంభాషణలు జరపడం వల్ల అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ మెటా సంస్థకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు

——

21 గంటల పోరాటం… కానీ దక్కని చిన్నారి ప్రాణం :

హర్యానాలో తెరిచి ఉన్న బోర్‌వెల్‌లో పడిన నాలుగేళ్ల నిర్వైర్ సింగ్ 21 గంటల పోరాటం తర్వాత మృతి చెందాడు. ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రమించి బయటకు తీసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు ఘటనపై విచారణకు ఆదేశిస్తూ, వాడని బోర్‌వెల్‌లను మూసివేయాలని రైతులకు సూచించారు.

——

చిత్తూరు లో వింత ఘటన :

వింత పురుగులు కుట్టడంతో 19 మంది విద్యార్థులకు అస్వస్థత. చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డీఎంపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో చెట్టుపై నుండి పడిన వింత పురుగులు కుట్టడంతో 19 మంది విద్యార్థులకు అస్వస్థత.

——

ఆరు రోజులు శిథిలాల కిందే.. మృత్యువును జయించాడు :

వెనిజులాలో రెండు వరుస భూకంపాల శిథిలాల కింద చిక్కుకున్న మూడేళ్ల బాలుడు ఆరు రోజుల తర్వాత సురక్షితంగా బయటపడ్డాడు. లా గువైరా స్టేట్‌లోని లాస్ కొరాలెస్ గార్డెన్ భవన శిథిలాల నుండి రెస్క్యూ సిబ్బంది ఈ మృత్యుంజయుడిని ప్రాణాలతో కాపాడారు. ఆరో రోజు సహాయక చర్యల్లో లభించిన ఏకైక బాధితుడు ఇతడేనని అధికారులు తెలిపారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

——–

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకాలపై గొంగిడి సునీత ఆగ్రహం :

యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో స్థానికులకు చోటు కల్పించలేదని ఆరోపణ.
వ్యాపారవేత్తలు, స్థానికేతరులతో బోర్డు ఏర్పాటు చేశారని విమర్శ.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నియామకాలు జరిగాయని మండిపాటు
ఆధ్యాత్మిక చింతన ఉన్న స్థానికులకు అవకాశం కల్పించాలని డిమాండ్.

——

ఆత్మకూరు చెరువులో మొసలి ప్రత్యక్ష్యం :

నంద్యాల జిల్లా ఇందిరేశ్వరం గ్రామంలోని పాత చెరువులో చేపల వలకు మొసలి చిక్కింది. చేపలు పడుతుండగా ఒక్కసారిగా మొసలి కనిపించడంతో మత్స్యకారులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు.

——-

రైతును వరించిన లక్!

మధ్యప్రదేశ్‌లో అదృష్టం వరించింది! పన్నా జిల్లాకు చెందిన ఆదివాసీ రైతు రాకేశ్ లీజుకు తీసుకున్న భూమిలో 11.19 క్యారెట్ల వజ్రం దొరికింది. దీని విలువ రూ.30 లక్షలు. విశేషమేమంటే, రెండేళ్ల క్రితం ఇదే కుటుంబానికి రూ.93 లక్షల వజ్రం దొరకడం గమనార్హం.

మరిన్ని వార్తలు