Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsకరీంనగర్జిల్లా వార్తలు

Karimnagar : బావపై బావమరిది కారుతో హత్యాయత్నం..!

స్థలం వివాదం కారణంగా పాత కక్షలను మనసులో పెట్టుకుని బావపై కారుతో హత్యా యత్నానికి పాల్పడిన నిందితుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.

Karimnagar : బావపై బావమరిది కారుతో హత్యాయత్నం..!

కరీంనగర్, మనసాక్షి :

స్థలం వివాదం కారణంగా పాత కక్షలను మనసులో పెట్టుకుని బావపై కారుతో హత్యా యత్నానికి పాల్పడిన నిందితుడిని కొత్తపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం దుర్శేడు గ్రామానికి చెందిన వేదులాపురం శంకర్‌కు, అతని బావమరిది కలికోట సంతోష్ కుమార్‌కు మధ్య కొంతకాలంగా స్థలం విషయంలో వివాదాలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలో సోమవారం నాడు సంతోష్ అన్నదమ్ముల స్థలం పంపకాల విషయమై మాట్లాడేందుకు శంకర్ ఎలగందుల గ్రామానికి వచ్చాడు. ఈ పాత గొడవలను మనసులో ఉంచుకున్న సంతోష్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న శంకర్‌ను తన కారుతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శంకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కొత్తపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం చింతకుంట ఎక్స్ రోడ్డు వద్ద నిందితుడు కలికోట సంతోష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు