ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్..!
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ను ఆదివారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కలిశారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసిన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్..!
చింతపల్లి, మనసాక్షి :
హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ను ఆదివారం
దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ కలిశారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గంలో విద్యుత్ సరఫరా, విద్యుత్ మౌలిక సదుపాయాల బలోపేతం, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సంబంధిత పనులు, కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, లైన్ల విస్తరణతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతో పాటు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రికి విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎమ్మెల్యేకు హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని, దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ తెలిపారు. వీరి వెంట దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- CM Revanth Ready : అలనాటి సహచరులు.. ఆప్యాయ పలకరింపులు.. 20 ఏళ్ల ప్రస్థానం నెమరువేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి..!
- Miryalaguda : ఆ ఏడు రకాల వరి విత్తనాలనే రైతులకు విక్రయించాలి..!
- Devarakonda : దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు..!
- రైతులు ఈ పంటలు సాగు చేస్తే నాలుగేళ్ళ పాటు ఏటా ఎకరానికి రూ.4200 ప్రభుత్వ సహాయం.. 30 ఏళ్ల పాటు స్థిరాదాయం..!









