Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్జాతీయంతెలంగాణ

Breaking News : మన సాక్షి టాప్ 10 బ్రేకింగ్ న్యూస్..!

స్థానిక విషయాలతో పాటు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి ఘటనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన సాక్షి చదవండి.

Breaking News : మన సాక్షి టాప్ 10 బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

స్థానిక విషయాలతో పాటు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయి ఘటనలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన సాక్షి చదవండి.


ప్రాణం ఉండగా BRSతో కలవను – కవిత

  • తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ BRS పార్టీతో కలిసేది లేదు — TRS చీఫ్ కవిత
  • తాను ఆ పార్టీలోకి వెళ్తానంటూ జరుగుతున్న ప్రచారం అబద్ధం
  • టీఆర్ఎస్ పేరు దక్కకుండా కుట్రలు
  • బీఆర్ఎస్‌కు ఎటువంటి నీతి, నియమాలు లేవు
  • సోషల్ మీడియాలో నాపై తల్లి, చెల్లి అనే అసభ్యకరమైన కామెంట్లతో దాడి చేస్తున్నారు

—- ——— —

హీరో ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

  •   హీరో ధర్మ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
  • మద్యం మత్తులో అతివేగంగా కారు నడిపిన యువకులు
  • గేటు, కాంపౌండ్ వాల్ ద్వంసం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ధర్మ కుటుంబ సభ్యులు

—- —

అల్‌ సభా రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు :

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రముఖ ‘అల్‌ సభా’ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఫ్రీజర్‌లో మాంసాన్ని ఇష్టారాజ్యంగా నిల్వ చేయడం, ఈగల మధ్య రుమాలి రోటీలు చేయడం, వాష్‌రూమ్‌లు అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్ర ఉల్లంఘనలను గుర్తించారు. దీంతో అధికారులు రెస్టారెంట్ FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తూ, లోపాలను పూర్తిగా సరిదిద్దే వరకు హోటల్‌ను మూసివేయాలని ఆదేశించారు.

——– —

కవిత ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదు :

బీఆర్ఎస్ ఖాతాలోని రూ.1,400 కోట్ల గురించి కవిత ముందే స్పందించి ఉంటే బాగుండేదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆమె ఆరోపణలను ఎవరూ నమ్మడం లేదని, దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఆమె తీరు ఉందని ఎద్దేవా చేశారు. సరైన సమయంలో విజిల్‌ బ్లోయర్‌గా వ్యవహరిస్తే ప్రజల మద్దతు లభించేదని ఆయన పేర్కొన్నారు.

——– —-

కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని BRS ధర్నా :

  • కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలని BRS ధర్నా
  • యాదాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట BRS ఆధ్వర్యంలో ఆందోళన
  • కాళేశ్వరం ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్
  • మాజీ ఎమ్మెల్యేలు ఫైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యతో పాటు BRS నేతల పాల్గొనం
  • కన్నెపల్లి పంపులను కావాలనే నడపడం లేదని ప్రభుత్వంపై ఆరోపణ

ఆరోజు పోలీసులు డ్రామా ఆడారు 

తమిళనాడు సీఎం విజయ్ కరూర్‌లో పర్యటించి TVK సభ తొక్కిసలాటలో మృతి చెందిన 32 కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆ ఘటన తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనదని, ఆరోజు పోలీసులు డ్రామా ఆడారని, DMK రాష్ట్రాన్ని లూటీ చేసిందని ఆయన విమర్శించారు.

—-

విశాఖ సింహాచలం వద్ద ఉద్రిక్తత :

  • విశాఖ సింహాచలం తొలి పావంచ వద్ద ఉద్రిక్తత
  • తొలి పావంచ వద్ద షాపులు తొలగిస్తున్న అధికారులు
  • పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యాపారస్తుడు
  • అడ్డుకున్న ఇతర షాపుల మహిళలు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు
  • ఎన్నో ఏళ్లుగా వ్యాపారం చేసుకుంటున్న తమ షాపులు తొలగించడం దారుణమంటున్న వ్యాపారస్తులు

— —

రైలులో శోభనం డెకరేషన్.. టీటీఈ సస్పెండ్

బల్లార్ష నుండి ముంబై వెళ్ళే నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో 1st ఏసీ భోగిలోని ఓ కుపేలో శోభనం డెకరేషన్ చేసుకున్న ఓ కొత్తజంట

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీఈని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు

— — —–

గోల్కొండ బోనాలకు భారీ ఏర్పాట్లు

రూ.20 కోట్ల నిధులు కోరిన మంత్రి కొండా సురేఖ. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న గోల్కొండ బోనాల ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్షించారు. భక్తుల సౌకర్యార్థం రూ.20 కోట్ల నిధులు కోరామని, షీ టీమ్స్, పారిశుద్ధ్యం, భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

— –=

గచ్చిబౌలి DLF వద్ద ఫుట్‌పాత్ ఆక్రమణల కూల్చివేతలు :

గచ్చిబౌలి DLF పరిధిలో రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా వెలిసిన షెడ్లు, షాపులను GHMC/CMC అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు