District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పంచాయతీల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలి..!
జిల్లాలోని గ్రామ పంచాయతీల వనరులు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పంచాయతీల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలి..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
జిల్లాలోని గ్రామ పంచాయతీల వనరులు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రంలో జిల్లాలోని మఖ్తల్ ,కృష్ణ, మాగనూర్, నర్వ, మరికల్ , ధన్వాడ మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక పై శిక్షణ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలలో తక్షణ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికను తయారు చేసుకుని నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఇటీవలే నిర్వహించిన 99 రోజుల ప్రగతి ప్రణాళిక మాదిరిగానే గ్రామ పంచాయతీలలో వచ్చే మూడేళ్ల లో ఏ ఏ పనులు చేయాలో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ రిసోర్స్ పర్సన్ లు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడానికి నిర్ణిత నమూనా ను తెలిపారు.
గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక 3 భాగాలుగా మొదటి భాగం గ్రామ పంచాయతీ ప్రొఫైల్, రెండవ భాగం గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక 2026-2029 సంవత్సరం వరకు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్ ) పి. ఆర్ ఇంజనీరింగ్, మిషన్ భగీరథ (త్రాగు నీరు & పారిశుధ్యం), సెర్ప్ & మహిళా సాధికారత, స్త్రీ నిధి, గ్రామ పంచాయతీ 3 సంవత్సరాల వరకు అంచనా బడ్జెట్ 2026-2029 ఆర్థిక సంవత్సరం వరకు, ఇక మూడవ భాగం శాఖల వారీగా వార్షిక పని మరియు ఆర్థిక పురోగతి (2026-27 ఆర్థిక సంవత్సరమునకు).
అలాగే వి బి జి రామ్ జి చట్టం 2025, తెలంగాణ జలసిరి ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరిలో ఊట కుంట, 16 వ ఆర్థిక సంఘం నిధులు నియమాలు, నిధుల వినియోగం గురించి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణన్, జెడ్పీ సీ ఈ వో శ్రీనివాస్ రావు, డీఆర్డీవో, డిపివో వెంకట్ రాములు, ఆయా మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.









