Miryalaguda : ఉస్మానియా పీహెచ్‌డీ పట్టా సాధించిన పెరుమండ్ల వినయ్..!
ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) విద్యుత్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పెరుమండ్ల వినయ్ కుమార్.. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) పట్టాను అందుకున్నారు.

Miryalaguda : ఉస్మానియా పీహెచ్‌డీ పట్టా సాధించిన పెరుమండ్ల వినయ్..!
మిర్యాలగూడ, మన సాక్షి :
ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) విద్యుత్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పెరుమండ్ల వినయ్ కుమార్.. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.) పట్టాను అందుకున్నారు. ఆయన “ఎన్‌హాన్స్డ్ మల్టీ-ఫంక్షనల్ ఈవీ ఛార్జర్ పెర్ఫార్మెన్స్ విత్ బై-డైరెక్షనల్ సెపిక్ కన్వర్టర్ అండ్ ఏఎన్‌ఎఫ్‌ఐఎస్ కంట్రోల్ ఫర్ గ్రిడ్-కనెక్టెడ్ పీవీ సిస్టమ్” అనే పరిశోధనా అంశంపై ప్రొఫెసర్ పి.వి. ప్రసాద్ ప్రధాన పర్యవేక్షణలో, ప్రొఫెసర్ ఈ. విద్యాసాగర్ సహ పర్యవేక్షణలో పరిశోధన పూర్తి చేసి పీహెచ్‌డీ పట్టాను అందుకున్నారు.
వినయ్ కుమార్ సాధించిన ఈ విజయం వెనుక ఆయన తల్లిదండ్రులు పెరుమండ్ల రాములు, సావిత్రమ్మ దంపతుల అపారమైన కృషి, త్యాగం, అంకితభావం ఉన్నాయి. చిన్ననాటి నుంచే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటూ, పిల్లలకు ఉన్నత విద్య అందించాలనే సంకల్పంతో పెరుమండ్ల రాములు చేసిన అవిశ్రాంత కృషి, సావిత్రమ్మ అందించిన ప్రేమ, ప్రోత్సాహం, కుటుంబ విలువలు ఈ విజయానికి బలమైన పునాదిగా నిలిచాయి.
ఈ సందర్భంగా వినయ్ కుమార్ మాట్లాడుతూ నా తల్లిదండ్రుల త్యాగం, గురువుల మార్గదర్శకత్వం, నా సతీమణి శైలజ సహకారం, నా కుమార్తెలు పి. జైత్విక, పి. చరిష్మల ప్రేమాభిమానాలు, అలాగే నా తమ్ముళ్లు పెరుమండ్ల విజయ్ కుమార్, పెరుమండ్ల చెంతన్ బాబు అందించిన ప్రోత్సాహం నాకు నిరంతరం అండగా నిలిచాయి. భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ విద్యా సందేశం, ఆశయాలు నాకు ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలిచాయి. ఈ విజయాన్ని నా తల్లిదండ్రులకు, గురువులకు, కుటుంబ సభ్యులకు అంకితం చేస్తున్నాను అని తెలిపారు.
ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు, నా స్వగ్రామమైన దీపకుంట గ్రామ ప్రజలు,డా. బి.ఆర్. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ, బీటీఎస్, నల్గొండ సభ్యులు, అధ్యాపకులు, పరిశోధకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు డా. పెరుమండ్ల వినయ్ కుమార్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో విద్యా, పరిశోధన రంగాల్లో మరెన్నో ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి :
- Hyderabad : విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి..!
- CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కాళేశ్వరం అప్పగిస్తాం..!
- Suryapet : పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులుగా మాడుగుల నవీన్ కుమార్ నియామకం..!
- Doctorate : డాక్టరేట్ లు ఎన్ని రకాలు.. అవి ఏమిటో తెలుసుకుందాం..!










