Breaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో రమణారెడ్డి తెలిపారు.

Miryalaguda : మిర్యాలగూడలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో రమణారెడ్డి తెలిపారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ఆర్డీవో, డిఎస్పి ఆధ్వర్యంలో వాడపల్లి, అనుముల, వేములపల్లి, నాగార్జునసాగర్ ప్రాంతాలలో నిమజ్జన ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందుకు గాను ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 08689 – 295001.
MOST READ :









