Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా
District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి..!
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.

District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలి..!
నారాయణపేటటౌన్, మనసాక్షి:-
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇచ్చి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 8 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా సత్వరం పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా ఆయా అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి వెంటనే పరిష్కరించాలి.
అదనపు కలెక్టర్ శ్రీను, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ALSO READ :









