ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్.. పోటీలో ఎవరెవరున్నారంటే..!
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. బిఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేయడం.. హైకోర్టు అనర్హత వేటు వేయడం తెలిసిన విషయమే.

ఖైరతాబాద్ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్.. పోటీలో ఎవరెవరున్నారంటే..!
మన సాక్షి, హైదరాబాద్ :
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. బిఆర్ఎస్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుంచి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీ చేయడం.. హైకోర్టు అనర్హత వేటు వేయడం తెలిసిన విషయమే. ఇది ఇలా ఉండగా దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అతడు సుప్రీంకోర్టుకు వెళ్లినా కూడా హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో ఖైరతాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
ALSO READ : Hyderabad : సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య..!
అయితే బిఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎవరిని దించాలనేది ఆ పార్టీ ఇప్పటికే ఫిక్స్ అయినట్లు సమాచారం. బిఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్ యాదవ్ తోపాటు పి జే ఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ALSO READ : ప్రేమ పేరుతో వల.. ఫైవ్ స్టార్ హోటల్ కు పిలిపించి బ్లాక్ మెయిల్..!
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ ను తిరిగి పోటీలో నిలబెడతారా..? లేదా..? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం దానం నాగేందర్ ను కార్పొరేటర్ గా పోటీ చేయించి హైదరాబాద్ మేయర్ గా చేయాలనేది ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా బిఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఇప్పటికే పలువురితో చర్చించినట్లు సమాచారం.









