Breaking Newsక్రైంజిల్లా వార్తలుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. కారు లాక్ కావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు డోర్ లాక్ కావడంతో నాలుగేళ్ల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం.. కారు లాక్ కావడంతో నాలుగేళ్ల చిన్నారి మృతి..!
మన సాక్షి వెబ్ డెస్క్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కారు డోర్ లాక్ కావడంతో నాలుగేళ్ల చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోభా నగర్ గ్రామానికి చెందిన గ్రామ సర్పంచ్ నవీన్, ఐశ్వర్య దంపతులకు ఇద్దరు పిల్లలు తన్విత శ్రీ (4) సురక్ష ఉన్నారు.
ALSO READ : Nalgonda : నల్గొండ జిల్లాలో హైవేపై మంటల్లో కాలిపోయిన లారీ..!
మీరు ఆదివారం స్కూలుకు సెలవు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా లాక్ చేయని కారులో ఎక్కి తనేత శ్రీ ఊపిరాడక స్పృహ తప్పిపోయింది. కాసేపటికి కూతురు కనిపించడం లేదని తల్లి చెప్పడంతో ఊరంతా వెతికి అనుమానంతో కారులో చూడగా స్పృహ తప్పి పడిపోయిన తన్విత శ్రీ ని గుర్తించి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికి మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు.









