RIMS : ఆదిలాబాద్ రిమ్స్ లో అర్ధరాత్రి కలకలం.. ఎగిసి పడిన మంటలు, పసికందు మృతి..!
తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో కలకలం నెలకొన్నది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

RIMS : ఆదిలాబాద్ రిమ్స్ లో అర్ధరాత్రి కలకలం.. ఎగిసి పడిన మంటలు, పసికందు మృతి..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలోని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో కలకలం నెలకొన్నది. ఆసుపత్రిలోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగం లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఏ సి కి సంబంధించిన సమస్యతో ఈ ఘటన జరిగింది. దాంతో వార్డులో ఉరుకులు పరుగులతో చిన్నారులను రక్షించుకునేందుకు ప్రయత్నం చేశారు.
ఈ వార్డులో మొత్తం 24 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఏసి పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో వార్డు మొత్తం పొగలు వ్యాపించడంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. చిన్నారులను ఆ వార్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ALSO READ : ప్రేమ పేరుతో వల.. ఫైవ్ స్టార్ హోటల్ కు పిలిపించి బ్లాక్ మెయిల్..!
ఈ ఘటనలో ఒక చిన్నారి శిశువు మృతి చెందగా ముగ్గురు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన 23 మంది శిశువులకు మెరుగైన వైద్యం కోసం ఇతర వార్డులు, ఆసుపత్రులకు తరలించినట్లు సమాచారం.
ఈ ఘటన విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాజార్షి షా, ఎస్పీ అఖిల్ మహల్ రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని వార్డును పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనకు సంబంధించి ఏసీ సమస్యతో వచ్చినట్లుగా తెలుస్తున్నప్పటికీ అసలు కారణాలు అధికారికంగా తేలాల్సి ఉంది.










