Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండహైదరాబాద్

క్యాప్ కోసం వెళితే.. ప్రాణమే పోయింది.. పెద్ద అంబర్పేట్ లో నల్గొండ యువకుడు మృతి..!

క్యాప్ కోసం వెళితే క్షణాల్లోనే ప్రాణమే పోయింది. ఈ ఘటన హైదరాబాదులోని పెద్ద అంబర్పేట్ వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది.

క్యాప్ కోసం వెళితే.. ప్రాణమే పోయింది.. పెద్ద అంబర్పేట్ లో నల్గొండ యువకుడు మృతి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

క్యాప్ కోసం వెళితే క్షణాల్లోనే ప్రాణమే పోయింది. ఈ ఘటన హైదరాబాదులోని పెద్ద అంబర్పేట్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై జరిగింది. ఈ ఘోరమైన దుర్ఘటనలో నల్గొండ జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హయత్ నగర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన ఏమి రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీలత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి నల్గొండ లోని ప్రైవేట్ పాఠశాల నడుపుతుండగా శ్రీలత రామన్నపేట మండలం బోగారం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తుంది. వీరు ప్రస్తుతం పిల్లలతో కలిసి పెద్ద అంబర్ పేట్ డివిజన్ పరిధిలోని పసుమాముల కెసిఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు ఏమిరెడ్డి అవినాష్ రెడ్డి (21) ఇటీవలనే బిటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు.

Also Read : పిల్లలు పుట్టడం లేదంటూ భార్యకు వేధింపులు.. అనుమానాస్పద మృతి

కాగా అవినాష్ రెడ్డి వ్యక్తిగత పనుల కోసం వెళ్లి సోమవారం సాయంత్రం తన స్కూటీ పై ఇంటికి బయలుదేరాడు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో రాగానే అవినాష్ రెడ్డి తల పెట్టుకున్న క్యాప్ గాలికి ఎగిరి రోడ్డు పై పడింది. అయితే తన స్కూటీని రోడ్డు పక్కన నిలిపి క్యాప్ తీసుకునేందుకు వెళ్లాడు.

క్యాప్ తీసుకుని వచ్చే సమయంలో వెనుక నుంచి అతివేగంగా నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఒక ఆయిల్ ట్యాంకర్ అతన్ని బలంగా ఢీ కొట్టింది. దాంతో అవినాష్ రెడ్డి రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న తమ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

మరిన్ని వార్తలు