హైదరాబాదులో కలకలం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య..!
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

హైదరాబాదులో కలకలం.. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య..!
మన సాక్షి, హైదరాబాద్ :
హైదరాబాద్ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Also Read : పిల్లలు పుట్టడం లేదంటూ భార్యకు వేధింపులు.. అనుమానాస్పద మృతి
వివరాల ప్రకారం.. విశాఖపట్నం కి చెందిన రాజేష్ (25) హైదరాబాద్ నగరంలోని నాగారంలో హాస్టల్లో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితులను కలవడానికి వచ్చాడు.
Also Read : హైడ్రామా.. పక్కా ప్లాన్.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..!
ఈ క్రమంలో దుర్గం చెరువును సందర్శించేందుకు రాజేష్ వెళ్ళాడు. అక్కడ కేబుల్ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజేష్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.









