Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Narayanpet : నారాయణపేటలో నాకాబందీ.. భారీగా వాహనాలు సీజ్..! 

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలోని 180 ఇళ్లను తనిఖీ చేశారు.

Narayanpet : నారాయణపేటలో నాకాబందీ.. భారీగా వాహనాలు సీజ్..! 

(నారాయణపేట టౌన్, రమాకాంత్, మనసాక్షి)

నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు డీఎస్పీ నల్లపు లింగయ్య ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం (కార్డన్ అండ్ సెర్చ్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 50 మంది పోలీసు సిబ్బంది పాల్గొని కాలనీలోని 180 ఇళ్లను తనిఖీ చేశారు. సరైన వాహన పత్రాలు లేని 41 వాహనాలను గుర్తించి సీజ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. వీటిలో 39 ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు ఉన్నాయని వెల్లడించారు.

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీస్ శాఖతో కలిసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో మహాతేజ రైస్ మిల్లులో.. వరిపొట్టులో కూరుకుపోయి డ్రైవర్ మృతి.. న్యాయం కోసం ఆందోళన..!

ఈ నేపథ్యంలో డిఎస్పి లింగయ్య మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని డీఎస్పీ స్పష్టం చేశారు. కాలనీ ప్రజలతో సమావేశమై నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, ఎవరైనా మాదకద్రవ్యాల విక్రయాలు లేదా వినియోగానికి పాల్పడుతున్నట్లు సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. కాలనీలో దొంగతనాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు ప్రజలు స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం సులభమవుతుందని వివరించారు.

అలాగే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Also Read : Miryalaguda : మిర్యాలగూడలో మహాతేజ రైస్ మిల్లులో.. వరిపొట్టులో కూరుకుపోయి డ్రైవర్ మృతి.. న్యాయం కోసం ఆందోళన..!

ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. శాంతియుత వాతావరణం నెలకొనేలా పోలీస్ శాఖతో కలిసి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సిఐ శివశంకర్, ఎస్ఐ లు వెంకటేశ్వర్లు, సతీష్ రెడ్డి, గాయత్రి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు