Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

వేములపల్లి బ్రిడ్జి పై ధాన్యం ట్రాక్టర్ బోల్తా.. ఒకరికి గాయాలు..!

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం లోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వంతెనపై శుక్రవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదం లో ధాన్యం ట్రాక్టర్ బోల్తా పడింది.

వేములపల్లి బ్రిడ్జి పై ధాన్యం ట్రాక్టర్ బోల్తా.. ఒకరికి గాయాలు..!

( వేములపల్లి – మౌలాలి, మనసాక్షి )

నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రం లోని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వంతెనపై శుక్రవారం ఉదయం జరిగిన రహదారి ప్రమాదం లో ధాన్యం ట్రాక్టర్ బోల్తా పడింది.

ధాన్యంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా:

మాడ్గులపల్లి మండలం కుక్కడం గ్రామ పంచాయతీ పరిధిలోని చింతలగూడెం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి ధాన్యం ట్రాక్టర్ లోడుతో వెళ్తుండ గా వంతెనపై అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది.

రాకపోకలకు తీవ్ర అంతరాయం:

నార్కట్ పల్లి – అద్దంకి రహదారిపై మిర్యాలగూడ వైపు వెళ్తున్న రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి రద్దీ ఏర్పడిందని స్థానికులు తెలిపారు.

గాయపడిన వ్యక్తిని వైద్యశాలకు తరలింపు:

ఈ ప్రమాదంలో గాయపడిన కృష్ణారెడ్డిని అత్యవసర వాహనంలో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ప్రాంత వైద్యశాలకు తరలించారు.

మరిన్ని వార్తలు