Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవికారాబాద్ జిల్లా

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు..!

తెలంగాణలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కారు, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. కారు, ప్యాసింజర్ ఆటో ఢీకొన్న ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం వికారాబాద్ జిల్లా బోంరాస్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతాపూర్ గ్రామ పరిధిలోని ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో జరిగింది.

Also Read : మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది.. నడిచే పద్ధతి ఇదే!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన బుడత శ్రీశైలం (23) తన కారులో హకీంపేట వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ప్యాసింజర్ ఆటో ఎదురుగా వచ్చింది . ఆటోలో 8 మంది ప్రయాణికులు ఉన్నారు . కాగా అనంతపుర్ సమీపంలో కారు ఎడమవైపు ముందు టైరు ఒక్కసారిగా పేలడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఆటోను ఢీకొట్టాడు.

Also Read : జీడిపప్పు మీకు ఇష్టమేనా, బాగా తింటున్నారా.. అయితే ఇది మీకోసమే..!

ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న బుడత శ్రీశైలం, ఆటోలో ప్రయాణిస్తున్న బీహార్ కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గాయపడిన వారిని కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎస్సై బాల వెంకటరమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు