భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఐదు ప్రైవేటు బస్సులు..!
హైదరాబాద్ నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాలి బూడిద అయ్యాయి.

భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన ఐదు ప్రైవేటు బస్సులు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
హైదరాబాద్ నగర శివారులోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాలి బూడిద అయ్యాయి. బౌరంపేటలోని బొడ్రాయి సమీపంలో ఉన్న ఒక పార్కింగ్ యార్డులో నిలిపి ఉన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు కాలి బూడిద అయ్యాయి.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు..!
తెలిసిన సమాచారం మేరకు.. పార్కింగ్ యార్డులో బస్సులను ఒకదానికి ఒకటి అతి సమీపంలో నిలిపి ఉంచడంతో ఒక బస్సులో మొదలైన మంటలు అన్ని బస్సులలోకి వ్యాపించాయి. ప్రమాద స్థలానికి అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో స్థానికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్గిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు.
Also Read : మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది.. నడిచే పద్ధతి ఇదే!
అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు . ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా..? లేదా..? మరి ఏదైనా కారణం ఉందా..? అని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









