హామీ ఇచ్చిన ఉద్యోగాలేవీ..? బిఆర్ఎస్ వినూత్న నిరసన..!
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నియోజ కవర్గ బీఆర్ఎస్వీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు.

హామీ ఇచ్చిన ఉద్యోగాలేవీ..? బిఆర్ఎస్ వినూత్న నిరసన..!
(ఆమనగల్లు, మనసాక్షి – ఇమ్రాన్)
ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుర్తి నియోజ కవర్గ బీఆర్ఎస్వీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్వీ కల్వకుర్తి నియోజ కవర్గ నాయకుడు మీసాల వర్షిత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
2023 ఎన్నికలకు ముందు అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని బీఆర్ఎస్వీ నాయకులు గుర్తుచేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా కనీసం పది వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని వారు ఆరోపించారు.
ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి అశోక్ నగర్‌కు వచ్చి నిరుద్యోగులతో కలిసి చాయ్ తాగాలని కోరారు. ఈ మేరకు నిరుద్యోగుల తరఫున ఒక కుర్చీని ఏర్పాటు చేసి పక్కనే చాయ్ తాగుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు లక్మల్లా శివ,రాజేష్ నాయక్, నరేష్, జునైద్, సాయి తదితర విద్యార్థిలు పాల్గొన్నారు.









