Breaking : అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు..!
గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Breaking : అప్పన్నపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్ర గాయాలు..!
(గరిడేపల్లి, మనసాక్షి – వీరాస్వామి)
గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామ సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో భర్త షేక్ నజీర్ అక్కడి కక్కడే మృతి చెందగా, భార్య హుస్సేన్ బీ తీవ్రంగా గాయపడింది. వివరాల్లోకి వెళితే.. హుజ్జునగర్‌కు చెందిన షేక్ నజీర్, ఆయన భార్య హుస్సేన్ బీ బైక్‌పై ప్రయాణిస్తుండగా అప్పన్నపేట సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నజీర్ మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన హుస్సేన్ బీని చికిత్స నిమిత్తం ఉజ్జునగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Also Read : ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు మృతి, మరో ఏడుగురికి గాయాలు..!
మృతుడు హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన వంట మాస్టర్‌గా గుర్తించారు. కల్లేపల్లి మైసమ్మ ఆలయం వద్ద వంట పని ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై గరిడేపల్లి ఎస్సై శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సిందని తెలియజేశారు. కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.









