Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్నగర్
తెలంగాణలో దారుణం.. పరిహారం డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..!
తెలంగాణలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముంపు పరిహారం కోసం కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తెలంగాణలో దారుణం.. పరిహారం డబ్బుల కోసం ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..!
మన సాక్షి, వెబ్ డెస్క్: తెలంగాణలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ముంపు పరిహారం కోసం కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించింది. వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండపూర్ గ్రామానికి చెందిన గజ్జి మల్లికార్జున్ (23) పశువుల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. అతడికి మక్తల్ కు చెందిన అంజమ్మ అనే యువతితో వివాహం జరిగింది. రెండు నెలల క్రితం మల్లికార్జున్ శ్రీశైలం వెళ్లగా అతడికి రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలానికి చెందిన శివ అనే వ్యక్తి బస్సులో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా ఏర్పడింది.
దాంతో శివ తరచూ మల్లికార్జున్ గ్రామానికి వస్తుండేవాడు. ఈ క్రమంలో మల్లికార్జున్ భార్య అంజమ్మకు అతడు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోని మల్లికార్జున్ కుటుంబానికి ఉదండాపూర్ జలాశయం ముంపు బాధితుల జాబితాలో 18 లక్షల రూపాయల పరిహారం వచ్చింది. దాంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకొని ఆ డబ్బులు అంజమ్మ సొంతం చేసుకోవాలని పథకం వేసింది.
Also Read : Gold Price : బంగారం ధర భారీగా పతనం.. ఒక్కరోజులో భారీగా తగ్గిన ధర, ఈరోజు ఎంతంటే..!









