Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. తహశీల్దార్, మరో ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్..!

సూర్యాపేట, జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

సూర్యాపేట, మనసాక్షి : సూర్యాపేట, జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించిన ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బతికున్న లకావత్ హేమ్ల చనిపోయినట్లు నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, తుంగతుర్తి మండలం బండ రామారంలోని రెండెకరాల భూమిని కొడుకు పేరుపై అక్రమంగా బదలాయించిన వ్యవహారంలో విచారణ జరిగింది. అక్రమ పట్టా మార్పిడి నిర్ధారణ కావడంతో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాల మేరకు తహశీల్దార్ టి. దయానంద్, వెంపటి హెల్త్ ఇన్స్పెక్టర్ లకావత్ యాదగిరిపై సస్పెన్షన్ వేటు వేశారు.

జూనియర్ అసిస్టెంట్ సస్పెండ్

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ దరఖాస్తుపై తహసీల్దార్‌కు తెలియకుండా డిజిటల్ కీ ఉపయోగించి, ఇద్దరికి బదులు ఒక్కరి పేరు మాత్రమే నమోదు చేసిన అక్రమం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో జాజిరెడ్డి గూడెం జూనియర్ అసిస్టెంట్ ఆర్.మల్లీశ్వరిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

By : MUTHYAM RAJU, SURYAPET

మరిన్ని వార్తలు