Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమహబూబ్‌నగర్

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్..!

మహబూబ్‌నగర్ పట్టణంలోని రాజేంద్రనగర్, సద్దలగుండు ప్రాంతంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు దాడి నిర్వహించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్..!

మహబూబ్ నగర్ జిల్లా, మన సాక్షి

మహబూబ్‌నగర్ పట్టణంలోని రాజేంద్రనగర్, సద్దలగుండు ప్రాంతంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీసులు దాడి నిర్వహించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సద్దలగుండు ప్రాంతానికి చెందిన అమల అనే మహిళ తన నివాసంలో ఈటె మన్యం సహాయంతో కొంతకాలంగా వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఈ క్రమంలో శనివారం వేపూరు గ్రామానికి చెందిన బోయిని శ్రీను, జడ్చర్ల మండలం గోప్లాపూర్ గ్రామానికి చెందిన తోకల మహేష్, తమకు తెలిసిన ఇద్దరు యువతులను తీసుకువచ్చి అమల నివాసంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
వెంటనే మహబూబ్‌నగర్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజిద్దీన్, ఎస్‌ఐ శివ నాగేశ్వర్ తమ సిబ్బందితో కలిసి సదరు ఇంటిపై దాడి నిర్వహించి ఈటె మన్యం, ఇద్దరు యువతులతో పాటు బోయిని శ్రీను, తోకల మహేష్‌లను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో ప్రధాన నిందితురాలైన అమల పోలీసుల దాడి సమయంలో అక్కడ లేదు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అదే రోజు రాత్రి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి, నిందితులను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.

BY : GOPAL, MAHABUBNAGAR 

మరిన్ని వార్తలు