Breaking NewsTOP STORIES

Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ప్రియులకు ఒక్కసారిగా షాక్ తగిలింది. వరుసగా రెండవ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. మరింత ధర తగ్గుతుందని ఎదురుచూసిన మహిళలకు షాక్ తగిలింది. శుభకార్యాల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. దాంతో పెరిగిన ధరలతో ఒకసారిగా షాక్ తింటున్నారు.

మంగళవారం ఒక్కరోజే (24 క్యారెట్స్) 100 గ్రాముల బంగారంకు 7600 పెరిగింది. 22 క్యారెట్స్ కు 7000 రూపాయలు పెరిగింది. సోమవారం 100 గ్రాములకు (24 క్యారెట్స్) 6600 పెరగగా మంగళవారం మరో 7600 పెరిగింది.

10 గ్రాముల (తులం బంగారం) 24 క్యారెట్ ధర రూ.77,070, 22 క్యారెట్స్ (తులం బంగారం) 10 గ్రాముల ధర 70,650 రూపాయలు ఉంది.

హైదరాబాదులో మంగళవారం బంగారం ధరలు :
22 క్యారెట్స్ గోల్డ్ :

ఒక గ్రాము 7065 రూపాయలు

8 గ్రాములకు 56,520 రూపాయలు

10 గ్రాములు 70,650 రూపాయలు

24 క్యారెట్స్:

1 గ్రాము 7707 రూపాయలు

8 గ్రాములు 61,656 రూపాయలు

10 గ్రాములు 77,070 రూపాయలు

100 గ్రాములు 7,70,700 రూపాయలు.

MOST READ : 

మరిన్ని వార్తలు