రూపానికి ప్రతీరూపం..!

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని బైరవునిపల్లి గ్రామంలో కవలలు గోపి వర్షిణి-హర్షిణి లు కవలలు ఉన్నారు.

రూపానికి ప్రతీరూపం..!

నేలకొండపల్లి,  మన సాక్షి :

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని బైరవునిపల్లి గ్రామంలో కవలలు గోపి వర్షిణి-హర్షిణి లు కవలలు ఉన్నారు. వీరి తల్లిదండ్రులు గోపి ఉపేందర్రావు- నాగలక్ష్మి లు వీరు గత 11 ఏళ్ల గా రూపానికి ప్రతీరూపంగా నిలుస్తున్నారు. ఇరువురు ప్రస్తుతం నేలకొండపల్లి లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల లో ఐదో తరగతి చదువుతున్నారు.

వీరు చిన్నప్పటి నుంచి ఒకే రకమైన దుస్తులు ధరించటానికి ఇష్టపడతారు. ఏ వస్తువు కొనుగోలు చేసిన ఇరువురు కు ఒకే రకమైనవి కొన్సాలిందే. అదే విధంగా చదువులో కూడ పోటీ పడి చదువుతారు. గురుకుల పాఠశాలలో ఒకే పాఠశాలలో సీటు సాధించారు. . వీరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. వీరిద్దరు అభిరుచులు ఒక్కటే. కవలల దినోత్సవం సందర్భంగా వీరికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

ALSO READ : చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!