చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!

చెరువుమాధారం చెరువు వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుపులు, కేకలు తోపులాటల మధ్య చెరువు కట్ట యుద్ధ వాతావరణం ఏర్పడింది. చేపల లోడు ను వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులను నివారించేందుకు నిర్వహకులు పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు.

చెరువుమాధారం చెరువు కట్ట పై ఉద్రిక్తత…! చేపల టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు..!

దాదాపు టన్ను చేపల లూఠీ చేసిన వైనం.

నేలకొండపల్లి, మన సాక్షి :

చెరువుమాధారం చెరువు వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆరుపులు, కేకలు తోపులాటల మధ్య చెరువు కట్ట యుద్ధ వాతావరణం ఏర్పడింది. చేపల లోడు ను వెళ్లనీయకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామస్తులను నివారించేందుకు నిర్వహకులు పెద్ద ఎత్తున జనసమీకరణ చేశారు.

దీంతో చెరువు కట్ట వద్ద ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. నేలకొండపల్లి మండలం లోని చెరువుమాధారం చెరువు లో చేపల వేట చేపట్టినప్పటీ నుంచి ప్రతీ రోజు వివాదాలు జరుగుతున్నాయి. గ్రామంలో అందరికి విక్రయించటం లేదనే ఆరోపణలతో చెరువు వద్ద లూఠీలకు పాల్పడ్డారు. టిప్పర్ల ను అడ్డగించి చేపలు ఎత్తుకెళ్లారు.

ALSO READ: పోలీస్‌ కొలువు సాధించినందుకు గర్వపడాలి… జిల్లా ఎస్పి చందాన దీప్తి..! 

బుధవారం తెల్లవారు జామున చెరువు కట్ట వద్ద చేపలను విక్రయించాలని గ్రామసులు డిమాండ్ చేశారు. టిప్పరను.అడ్డుకోవటంతో సదరు కాంట్రాక్టర్ పెద్ద ఎత్తున జనసమీకరణ తో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. ఆరుపులు, కేకల మధ్య వివాదం తారా స్థాయి కి చేరింది. పోలీసుల జోక్యంతో టిప్పర్ల ను పంపించారు.

కాగా అక్కడ నుంచి చేపలను డంపింగ్ చేసే ప్రాంతం వద్ద కు వెళ్లి విక్రయించాలని కోరారు. కానీ అక్కడ కూడ ఘర్షణలు జరిగాయి. చివరకు గ్రామస్తులు అగ్రహించి దాదాపు 1 టన్ను చేపల ను ఎత్తుకెళ్లారు. దీంతో చెరువుమాదారం చెరువు వద్ద ప్రవేట్ సైన్యం ను భారీగాదింపారు. అధికారులు స్పందించకుంటే చెరువు పై తీవ్ర స్థాయిలో గొడవలు జరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ALSO READ : పేకాటరాయులను పట్టుకున్న పోలీసులు..!