Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

Miryalaguda : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

మిర్యాలగూడ , మన సాక్షి : దామరచర్ల నుంచి మిర్యాలగూడ కు వస్తున్న వ్యక్తి వాహనాన్ని వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మిర్యాలగూడ మండలంలోని గూడూరు సమీపంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు మృతుడు మాలోతు వాగ్య ( 40) దామచర్ల మండలం నరసాపురం గ్రామం నుండి కిరాణానికి సంబంధించి కొనుటకు గాను తన ఇంటి నుండి మోటార్ సైకిల్ నెంబర్ ఏపీ 24 ఏ జెడ్ 0612 పై మిర్యాలగూడ వైపు వస్తుండగా సుమారు 6 .30 గంటలకు మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామం వద్దకు చేరుకునేసరికి అద్దంకి-నార్కెట్పల్లి జాతీయ రహదారిపై దామచర్ల వైపు నుండి మిర్యాలగూడ వైపుగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వెనక నుండి డీకొట్టింది.

తల వెనుకల తీవ్రత గాయాలయి, చెవి ముక్కు నుండి రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి ఒక భార్య ఒక కొడుకు, ఒక కూతురు కలరు. మృతుని భార్య మాలోతు లలిత ఫిర్యాదు మేరకు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము.

ALSO READ : 

Gas Stove : ఇంట్లో గ్యాస్ స్టవ్ మూడు బర్నర్ ఉంటే మంచిదా..? కాదా..?

WhatsApp : వాట్సాప్ లో రెండు కొత్త ఫీచర్లు.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

Work From Home : వర్క్ ఫ్రం హోం ఉద్యోగం కావాలా..? లక్షల జీతం.. ఇలా పొందండి..!

మరిన్ని వార్తలు