BREAKING : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..!
BREAKING : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..!
ముదిగొండ, మన సాక్షి :
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరోకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని గోకినేపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. ముదిగొండ మండలం గోకినేపల్లి జాతీయ రహదారిపై లాగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా డీ కోటడంతో గుగులోతు సంతోష్ (22) మృతి చెందగా, గుగులోతు సతీష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నేలకొండపల్లి మండలం మంగాపురం తండాకు చెందిన గుగులోతు సంతోష్, గుగులోతు సతీష్ బైక్ పై ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండగా గోకినేపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో సంతోష్ అంబులెన్స్ లో హుటా హుటిన ఆస్పత్రిలో చికిత్స చేస్తుండగా మృతి చెందారు.
సతీష్ కూడా తీవ్ర గాయాలు కావడంతో మృతితో పోరాడుతున్నాడు. సంతోష్ ఇంటర్ చదువుతుండగా, సతీష్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. కలిసిమెలిసి తిరిగిన మిత్రులలో ఒకరు మృతి చెందడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చేతికందిన కొడుకు మృతి చెందటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. జరిగిన ప్రమాదంపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :
BREAKING : తల్లి, కూతుళ్లు అదృశ్యం.. కేసు నమోదు..!
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!
మిర్యాలగూడ : స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనవడు..!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే టిసి ఉద్యోగాలు, 11,250 ఖాళీలు..!









