Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
Miryalaguda : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
Miryalaguda : విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..!
మిర్యాలగూడ, మన సాక్షి :
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం దుబ్బ తండ గ్రామంలో చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం దుబ్బతండా గ్రామానికి చెందిన మాలోతు బద్రు (60) అను వ్యక్తి శ్రీనివాస నగర్ గ్రామ శివారులోని మాలోతు బాలు పొలం వద్దకు పచ్చ గడ్డి కోయడం కోసం వెళ్లి పొలంలోని బోరుబావి వద్ద పచ్చగడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి బోరు మోటర్ కరెంటు వైర్ కు తగిలి కరెంట్ షాక్ తో చనిపోయాడు.
మృతుని గురించి వెతుకుతున్న కుటుంబ సభ్యులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మాలోతు బాలు పొలంలో మృతుని శవాన్ని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రికి మృతిదేహాన్ని తరలించినట్టు ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు.మృతుని కుమారుడు మాలోతు లచ్చు సాధ్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ పేర్కొన్నారు.
MOST READ :
-
Nalgonda : ఈ ముఠా మామూలోళ్లు కాదు.. తోటలో కల్తీ మద్యం తయారీ.. బ్రాండెడ్ పేరుతో విక్రయం..!
-
Bhadrachalam : తొమ్మిదేళ్ల తర్వాత రేవంత్ తో మొదలైన సాంప్రదాయం.. సర్వత్ర హర్షం..!
-
Job Mela : పోలీసు శాఖ జాబ్ మేళాకు విశేష స్పందన.. 3033 మంది ఉద్యోగాలకు ఎంపిక.. నియామక పత్రాల అందజేత..!
-
Gold Price : వరుసగా రెండో రోజు పడిపోయిన బంగారం ధర.. ఈ రోజు తులం ఎంతంటే..!
-
WhatsApp New Feature : వాట్సాప్ లో అదిరిపోయే ప్రైవసీ.. సెండ్ చేసినా సేవ్ చేసుకోలేరు..!









