శబరిలో మృతి చెందిన సూర్యాపేట వాసి.. ఆదుకున్న అయ్యప్ప ధర్మ ప్రచార సభ..!

ఇటీవల శబరిమలలో మృతి చెందిన సూర్యాపేట వాసి ఉయ్యాల లింగయ్య స్వామి కి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

శబరిలో మృతి చెందిన సూర్యాపేట వాసి.. ఆదుకున్న అయ్యప్ప ధర్మ ప్రచార సభ..!

అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.

సూర్యాపేట, మనసాక్షి

ఇటీవల శబరిమలలో మృతి చెందిన సూర్యాపేట వాసి ఉయ్యాల లింగయ్య స్వామి కి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులకు 30 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.

లింగయ్య స్వామి మృతి చెందిన విషయం సూర్యాపేట జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు కేరళ లొ ఉన్న అయ్యప్ప ధర్మ ప్రచారం సభ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాస్ , కార్యదర్శి శిరాంశెట్టి రాజేష్ కు తెలియపర్చారు. వారి సూచన మేరకు జాతీయ కమిటీ , రాష్ట్ర కమిటీ సభ్యుల సహకారం తో పంపిన ముప్పై వేయుల రూపాయలను బుధవారం వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.

ALSO READ : సూర్యాపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం..!

ఈ కార్యక్రమం లొ రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతోజు భాస్కరా చారి, జిల్లా అధ్యక్షులు రంగు ముత్యంరాజు, జిల్లా కమిటీ సభ్యులు మాలి లింగా రెడ్డి, సుంకాని శ్రీనివాస్ స్వామి, మొరిశెట్టి సత్యనారాయణ, మాశెట్టి నరేష్ అశోక్, శ్రవణ్, శివశంకర్, పూజారులు హనుమా ప్రసాద్,సాయి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : తాజా సమాచారం అందించడంలో ముందున్న మనసాక్షి.. ఎమ్మెల్యే చిట్టెం పర్నికారెడ్డి..!

లింగయ్య స్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యలను ఓదార్చి, వారికీ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. దీక్ష లొ ఉన్న వంకాయలపాటి శంకర్ స్వామి, భూపతి శ్రీనివాస్ స్వామి, రాపర్తి మహేష్ స్వామిలు తమ ప్రగాఢ సంతాపన్ని తెలిపారు.