సూర్యాపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం..!

సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసానికి రంగం సిద్ధం అయుంది అందుకు సంబందించిన కౌన్సిలర్ లు కలెక్టర్ ను కలిసి నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

సూర్యాపేట : మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం..!

నోటీసులు అందజేయనున్న కౌన్సిలర్లు!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మీద అవిశ్వాసానికి రంగం సిద్ధం అయుంది అందుకు సంబందించిన కౌన్సిలర్ లు కలెక్టర్ ను కలిసి నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

చైర్మన్ ,వైస్ చైర్మన్ పై ఆవిశ్వాసానికి మద్దతుగా 36 మంది కౌన్సిలర్లు సంతకాలు చేసినట్టుగా సమాచారం.
చైర్మన్ రేసులో 31 వ వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి ? .. వైస్ చైర్మన్ రేస్ లో 44 వార్డ్ కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్ తో పాటుగా పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి చెందిన యువ కౌన్సిలర్ పోటీపడుతున్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

ALSO READ : ఆంధ్రప్రదేశ్ లో మనసాక్షికి పెరుగుతున్న ఆదరణ.. వైసిపి ఎమ్మెల్యే రెడ్డి శాంతి..!

సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ జనరల్ స్థానం అయితే మంత్రి జగదీష్ రెడ్డి జనరల్ వారికీ ఇవ్వకుండా ఎస్ సి మహిళకు స్థానం కలిపించారు. అప్పుడు బి ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం తో ఈ ఒక్క కౌన్సిలర్ నోరు మేడప్పకుండా ఉన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తో అసంతృప్తి తో ఉన్న కౌన్సిలర్ లు తిరుగుబాటు జెండా ఎగర వేస్తున్నారు.

ALSO READ : ఫ్లాష్.. ఫ్లాష్.. రంగారెడ్డి జిల్లాలో దారుణం..!