రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి..!
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి..!
చింతపల్లి, మన సాక్షి:
హైదరాబాద్ నాగర్ సాగర్ రహదారి పై జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనలో ఓ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం లో చోటు చోటు చేసుకుంది.
యాచారం సీఐ నరసింహారావు తెలిపిన వరాల ప్రకారం యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కొండ్ర డ్డి యాదయ్య మాల్ గ్రామంలో స్థిరపడ్డాడు. అతని కుమారుడు రామ్ చరణ్ 16 సంవత్సరాలు కొత్తపల్లి గ్రామంలోని తన తాత వద్దకు వెళ్లడానికి మాల్ నుండి లిఫ్ట్ అడిగి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు.
అదే సమయంలో తమ్మలోని గూడెం గేట్ సమీపంలో హైదరాబాదు నుండి మల్లేపల్లి వైపు వెళ్తున్న టీజీ 07f6688 కారు ఎదురుగా వస్తున్న మోటార్ బైకును ఢీ కొట్టింది. దీంతో ఆ విద్యార్థి రామ్ చరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తీవ్రంగా గాయపడిన చింతపట్ల గ్రామానికి చెందిన మోటర్ బైక్ నడుపుతున్న రవి కి తీవ్ర గాయాలు కావడంతో 108 సహకారంతో మాల్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన విషయం తెలుసుకున్న యాచారం పోలీసులు ప్రమాద సంఘటన విషయాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.









