Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : జాతీయ లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం..!

ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 3890 కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీస్ శాఖ, న్యాయ విభాగం మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించమని ఎస్పీ కే నరసింహ ఒక ప్రకటన లో అన్నారు.

Suryapet : జాతీయ లోక్ అదాలత్‌లో 3890 కేసుల పరిష్కారం..!

సూర్యాపేట, మనసాక్షి :

ఈ నెల 28న జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 3890 కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో పోలీస్ శాఖ, న్యాయ విభాగం మరియు ఇతర సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించమని ఎస్పీ కే నరసింహ ఒక ప్రకటన లో అన్నారు..
ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించబడిందని తెలిపారు.

ఈ సందర్భంగా మొత్తం 3890 కేసులు పరిష్కరించబడినవి. ఇందులో ఎం వి యాక్ట్, డి డి కేసులు : 1845, ఈ -పెట్టీ కేసులు 1463, ఐపీసీ కేసులు 498, ఎస్ ఎల్ ఎల్ కేసులు 84 పరిష్కరించబడినట్లు తెలిపారు..
జాతీయ లోక్ అదాలత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు త్వరిత న్యాయం అందించడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న చిన్నచిన్న కేసులను పరస్పర అవగాహనతో, చట్టబద్ధంగా పరిష్కరించడం ద్వారా ప్రజల సమయం మరియు ఖర్చు కూడా ఆదా అవుతుందని అన్నారు.

అదేవిధంగా, ప్రజలు తమ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవడం వల్ల దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందగలరని, భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ కార్యక్రమాలు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది, న్యాయవాదులు మరియు సంబంధిత శాఖల ప్రతినిధులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో కేసుల పరిష్కారం సాధ్యమైందని ఎస్పీ అభినందించారు.

మరిన్ని వార్తలు