Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణమంచిర్యాల జిల్లా

BREAKING : ఉద్యోగం రాలేదని మనస్థాపం.. ఉరి వేసుకొని యువకుడు మృతి..!

BREAKING : ఉద్యోగం రాలేదని మనస్థాపం.. ఉరి వేసుకొని యువకుడు మృతి..!

లక్షెట్టిపేట్, (మన సాక్షి);

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి రోడ్డు రాంనగర్ కు చెందిన గాధనవేని తిరుపతి అనే (25) యువకుడు ఇంట్లో ఉండే సీలింగు ఫ్యాన్ కొండికి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని సోమవారం రోజున మృతి చెందాడు. మృతుడు ఇంటర్ వరకు చదివి ప్రస్తుతం సెంట్రిగ్ పని చేసుకుంటున్నాడు.

తన అన్న ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.మృతుడు కూడా రెండుసార్లు ఆర్మీ ఉద్యోగ కోసం దరఖాస్తు చేసుకొని రన్నింగ్ లో క్వాలిఫై కాలేకపోయాడు. దానితో చాలా బాధపడుతూ దిగులుగా ఉండేవాడు. అన్నకి ఉద్యోగం వచ్చి సెటిల్ అయ్యాడు తనకి ఉద్యోగం రావడం లేదంటూ బాదపడితే ఇంట్లో వాళ్ళు నచ్చజెప్పేవాళ్ళు. అదే క్రమంలో నిన్న ఆదివారం రాత్రి కూడా బాధపడితే ఇంట్లో వాళ్ళు ఓదార్చి వెళ్లి పడుకోమని చెప్పగా గదిలోకి వేల్లి గడియ పెట్టుకొని పడుకున్నాడు.

సోమవారం ఉదయం తిరుపతి లేవలేదని ఇంట్లో వాలు తలుపు కొడితే తీయలేదు ఇంట్లో వాళ్ళు స్థానికులను పిలిచి తలుపు పగులకొట్టి చూసేసరికి ఉరి వేసుకుని వేలాడుతూ చనిపోయి ఉన్నాడు. మృతుడి తండ్రి కొమురయ్య పిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని లక్షెట్టిపేట ఎస్సై సతీష్ తెలిపారు.

ALSO READ : 

WhatsApp : వాట్సాప్ లో సరికొత్త ఫీచర్.. ఫోన్ నెంబర్ లేకుండానే క్రియేట్ చేయొచ్చు..!

Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!

30న రెండో విడత రుణమాఫీ..!

మరిన్ని వార్తలు