Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆదిలాబాద్క్రైంజిల్లా వార్తలు

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఓవైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. మరోవైపు అవినీతి అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి.

ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఓవైపు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. మరోవైపు అవినీతి అక్రమాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బిల్లుల మంజూరులో అవినీతికి పాల్పడుతున్న అవినీతి అధికారి ఏసీబీ కి చిక్కిన ఘటన ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో చోటు చేసుకుంది.

గృహ నిర్మాణ శాఖలో ఏఈ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి నుండి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. మండల కేంద్రంలోని ఓ గిరిజన లబ్ధిదారునికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. ఇంటి నిర్మాణంలో రూప్ లెవెల్ వరకు బిల్లు ఇవ్వాలని లబ్ధిదారుడు సదరు అధికారులను కోరారు.

బిల్లు మంజూరుకు రూ.20 వేలు ఇవ్వాలని ఏఈ శ్రీకాంత్ డిమాండ్ చేశాడు. తన వద్ద ఇంత డబ్బు లేదని, చివరకు రూ.10 వేలు ఇస్తామనడంతో అధికారి ఒప్పుకున్నాడు. ఆ పది వేలు సైతం తన వద్ద లేకపోవడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లబ్ధిదారు నుండి రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా ఏఈ శ్రీకాంత్ ను ఎసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

  1. TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!

  2. Alumni : 35 ఏళ్ల నిరీక్షణకు తెర.. సూర్యాపేటలో మిత్రుల జ్ఞాపకాల హరివిల్లు..!

  3. Rythu Bharosa : యాసంగి రైతుకు భరోసా ఏదీ.. శాటిలైట్ సర్వే పూర్తయ్యేది ఎప్పుడు..!

  4. Gold Price : తగ్గినట్టే తగ్గి రికార్డు సృష్టించిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు