Breaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!

జగిత్యాల ప్రతినిధి, (మన సాక్షి)

జగిత్యాల జిల్లా మున్సిపాలిటీ పరిధిలో నూక పెల్లి డబుల్ బెడ్ రూం ఇండ్లలో లబ్దిదారులకు పంపిణీ చేయగా మిగిలిన ఇండ్లకు మీ సేవ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 9 వ తేదీ ముగుస్తుందని, ఈ సందర్భంలో అప్లికేషన్లు స్వీకరించుటకు ఈ నెల 17 వరకు పొడగించినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

లబ్ధిదారులు కుల ధ్రువీకరణ, ఆదాయ సర్టిఫికెట్లు తెచ్చుకోనుటలో జాప్యం వలన అసలైన లబ్ధిదారులు నష్టపోకుండా ఉండటం కోసం అప్లికేషన్ల స్వీకరణను గడువు పెంచినట్లు పేర్కొన్నారు. గతంలో తెలిపిన విధంగా మీ సేవ కేంద్రం ద్వారా నూతన ఆర్జి దారులు దరఖాస్తు చేసుకొని, డాక్యుమెంట్లు లేని యెడల మీ సేవలో డాక్యుమెంట్లు స్వీకరించబడవని తెలిపారు.

మీ సేవ కేంద్రంలో ఆర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆర్జిలు స్వీకరించవలెనని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

LATEST UPDATE : 

Heavy Rain : ఆత్మహత్యే శరణ్యం.. కౌలు రైతు కుటుంబం ఆవేదన..!

UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!

Runamafi : రుణమాఫీ కాని వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక ప్రకటన..!

Heavy Rain : భారీ వర్షాలు.. నేడు ఆయా జిల్లాల్లో స్కూళ్లకు సెలవు..!

మరిన్ని వార్తలు