Miryalaguda : హత్య కేసులో నిందితుల అరెస్టు..!
Miryalaguda : హత్య కేసులో నిందితుల అరెస్టు..!
మన సాక్షి, మిర్యాలగూడ :
ఈనెల 7 నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాదగిరి పల్లి గ్రామానికి చెందిన జనార్ధన్ అనే యువకుడ్ని అదే గ్రామానికి చెందిన విక్రమ్ అనే వ్యక్తి పాదకాక్షల మనసులో పెట్టుకొని తన కుటుంబీకుల సహాయంతో జనార్దన్ ను విచక్షణ రహితంగా కొట్టడంతో జనార్ధన్ ఏరియా హాస్పిటల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్య కేసులో నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు.
గురువారం మిర్యాలగూడ డి.ఎస్.పి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డిఎస్పి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ చింటూ అనే యువకుని గొడవలో జనార్ధన్ కు విక్రమ్ కు రెండు నెలల క్రితం గొడవపడినట్లు అది మనసులో పెట్టుకొని విక్రం రెండు నెలల తర్వాత తన కుటుంబీకులు ఆయన పెద్ద శ్రీను, ఎల్లమ్మ, అజిత్ అందరూ కలిసి మూకుమ్మడిగా కలిసి కలిసి యువకున్ని విచక్షణారహితంగా తలపై కడుపులో కొట్టడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోగా మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి పెంచగా ఆరోగ్య పరిస్థితి విషమించటంతో నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స పొందుతూ ఈనెల తొమ్మిదిన మృతి చెందినట్లు తెలిపారు. మృతుని అన్న వస్కుల కొండల ఫిర్యాదు మేరకు మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులను గురువారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.యువకుని హత్య కేసులో నిందితులను చాకచక్యంగా దర్యాప్తు చేసిన రూరల్ పోలీసులను డిఎస్పి అభినందించారు. వారి వెంట గ్రామీణ వీరబాబు. ఎస్సై కే నగేష్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)
NALGONDA: 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి, ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలి.!









