NALGONDA: 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి, ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలి.!

బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు

NALGONDA: 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి, ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలి.!

నల్గొండ, మనసాక్షి :

బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. నల్లగొండ జిల్లాలోని కనగల్, మునుగోడు, నాంపల్లి, చండూర్, మర్రిగూడ, గట్టుప్పల్ పోలీస్ స్టేషన్ లను బుధవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్ సందర్శించారు.

పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది వివరాలు, సిబ్బంది పనితీరు, పోలీసు స్టేషన్ పరిసరాలు, రికార్డుల నిర్వహణ, స్టేషన్ కేసుల స్థితిగతులు, పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగే ప్రాంతాలు, శాంతిభద్రతలు సంఘ వ్యతిరేక కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని క్రైమ్ రేటు ను మరింత తగ్గించేందుకు కృషి చేయాలని, కేసులను త్వరిత గతిన పూర్తిచేసి భాదితులకు తగు న్యాయం జరిగేలా పనిచేయాలని ఆదేశించారు.

ప్రతి రోజు ప్రమాదాల నివారణ కొరకు స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించాలని అన్నారు. దొంగతనాలు జరగకుండా పగలు, రాత్రి పెట్రొలింగ్ నిర్వహించాలని, సి.సి కెమెరాల ఏర్పాటు చేసుకునేలా ప్రతి గ్రామంలో ప్రధాన కూడలిలలో ప్రజలకు, వ్యాపార సముదాయాల నిర్వహులకు అవగాహన పెంచాలని, అన్ లైన్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని ఆదేశించారు.

అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అక్రమ గంజాయి, పీడీఎస్ రైస్,జూదం లాంటి కార్యకలాపాల పైన అను నిత్యం నిఘా ఏర్పాటు చేసి నిత్యం తనిఖీలు నిర్వహించాలని అన్నారు. బ్లూకోర్ట్స్, పెట్రో మొబైల్ పోలీసు సిబ్బంది అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ డయల్ 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించి ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలని అన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరిoచి బాధితులకు తగు న్యాయం జరిగేలా పోలీస్ సిబ్బంది పనిచేయాలని, సామాన్యుడు పోలీస్ స్టేషన్ కి వస్తే న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలగజేసేల పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యస్.పి వెంట దేవరకొండ డిఎస్పీ గిరిధర్, చండూర్ సీఐ వెంకటయ్య, నాంపల్లి సిఐ నవీన్ కుమార్, యస్.ఐలు సురేష్, రంగారెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకట్ రెడ్డి, రామకృష్ణ,లచ్చి రెడ్డి, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

ఇది కూడా చదవండి : 

SIM Cards New Rules : జస్ట్ వన్ మినిట్.. మీ పేరున ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోండి ఇలా.. లేదంటే రెండు లక్షల జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష..!

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి జలక్.. వారికి రుణమాఫీ కట్..!

Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!