Bjp : మేఘ కృష్ణారెడ్డి కి మీకున్న సంబంధం ఎంటి..? సీఎం రేవంత్ రెడ్డి పై ఏలేటి సంచలన ఆరోపణ.. ఇడి, సిబిఐ విచారణ కోరుతాం..!

రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

Bjp : మేఘ కృష్ణారెడ్డి కి మీకున్న సంబంధం ఎంటి..? సీఎం రేవంత్ రెడ్డి పై ఏలేటి సంచలన ఆరోపణ.. ఇడి, సిబిఐ విచారణ కోరుతాం..!

మన సాక్షి , హైదరాబాద్ :

రాష్ట్ర ప్రభుత్వం జీవోలను పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చీకటి ఒప్పందాలతో కాంట్రాక్టర్లకు దోచిపెడుతోందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రహస్య జీవోలతో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికి రూ.1100 కోట్ల కాంట్రాక్ట్ పనులు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చీకటి ఒప్పందాలు చేసుకొని జీవోలు తెచ్చి బలవంతపు వసూళ్లు చేస్తుందని అన్నారు.

కేంద్రం నుంచి అమృత్ స్కీమ్ లో రూ. 3 వేల కోట్ల కాంట్రాక్టర్ల లో అవినీతి కి పాల్పడ్డారని ఆరోపించారు. దీన్ని మూడుగా డివైడ్ చేసి వెయ్యి కోట్లకు ఒక్కరిగా కాంట్రాక్టు ఇచ్చారన్నారు.. మేఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల ప్రాజెక్ట్ ఇచ్చారని తెలిపారు.
రేవంత్ బామ్మర్ది సృజన్ అనే వ్యక్తీ కి చెందిన శోధ కంపెనీకి రూ. 400 వందల కోట్ల కాంట్రాక్టర్ ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రూ. 600 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ ను వెయ్యి కోట్లకు ఇచ్చినట్లు చెప్పారు. 30 నుంచి 35 శాతం తక్కువకు పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు సిద్దంగా ఉన్నారని తెలిపారు. అంటే ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్ పొంచి కాంటాక్ట్స్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తం కలిపి రూ.1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఏ ఒక్క జీవో ను కూడా ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని ప్రశ్నించారు.

ALSO READKTR : మీకు అన్నగా ప్రచారం చేసుకుంటున్న సుధీర్ రెడ్డి.. అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్వీట్..!

మేఘా కృష్ణారెడ్డి మీద కాళేశ్వరం ఎంక్వైరీ జరుగుతుంది కదా? ఆయన మీద జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తుందని అన్నారు.అలాంటప్పుడు ఆయన కంపెనీ నీ బ్లాక్ చేయకుండా కాంట్రాక్టు ఎలా ఇచ్చారు? అని మండిపడ్డారు
మేఘా కృష్ణారెడ్డితో తెలంగాణ సొమ్ము కక్కిస్తాను చెప్పిన రేవంత్ రెడ్డి… మళ్ళీ ఆయనకు కాంట్రాక్ట్ ఇవ్వడం వెనకున్న మతలబు ఏమిటి? అని అనుమానం వ్యక్తం చేశారు.మేఘా కృష్ణారెడ్డికి మీకున్న సంబంధం ఏంటని ప్రశ్నించారు.

ఇక కరీంనగర్ లో సీఎం తమ్ముడు పార్టనర్ అని చెప్తున్నారని చెప్పారు. రాబోయే కొడంగల్ టెండర్లలో కూడా మేఘా కు పెద్ద పీట వెయ్యబోతున్నారని అన్నారు. దీనికి ఎస్టిమేట్ ప్రయివేట్ ఇంజనీర్లు తో వేయించుకుంటున్నారని తెలిపారు. తాను అడిగిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

నిధుల్లో జరిగిన అవినీతి ఈడి, సిబిఐ విచారణ కొరతామని మహేశ్వర్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)

NALGONDA: 100 ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి, ఆపదలో ఉన్న వారిని తక్షణమే ఆదుకొవాలి.!

NALGONDA : నల్గొండ జిల్లాలో దారుణం.. ఆకతాయిల వేధింపులకు యువతి బలవన్మరణం..!