పశువులకు మేతగా వరి పంట.. భూగర్భ జలాలు అడుగంటి ఎండుతున్న బోర్లు..!

వేసవికాలంలో తీవ్రమైన ఎండలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. వరి పంటలు పశువులకు మేతగా మారింది.

పశువులకు మేతగా వరి పంట.. భూగర్భ జలాలు అడుగంటి ఎండుతున్న బోర్లు..!

దేవరకొండ, మనసాక్షి :

వేసవికాలంలో తీవ్రమైన ఎండలు ఎక్కువయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. వరి పంటలు పశువులకు మేతగా మారింది. ఆరుగాలం కష్టపడి అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఎండిపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలో భూగర్భజలాలు అడుగంటడంతో వరి పంటలు పశువుల పాలయ్యాయి.

దేవరకొండ మండలాన్ని కరువు మండలంగ ప్రకటించి పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతుల కుటుంబాలకు ఎకరానికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నల్ల వెంకటయ్య ప్రభుత్వాన్ని చేశారు. దేవరకొండ మండలంలోని కర్నాటి పల్లె. గ్రామ పంచాయతీ పరిధిలోని ఆంబోతు తండా జాల్ తండా తదితర గ్రామాల్లో పంటలు ఎండిపోయిన పంట పొలాలను సిపిఎం బృందం పరిశీలించి రైతుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు వేస్తే నీరు లేక పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారని వారు అన్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే రైతుల పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించాలని వారు అధికారులు కోరారు. ఈ సర్వేలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బిజిలి. లింగయ్య రైతులు ఆంబో త్. మౌనిక నరేష్ . రమేష్ . ఆంబోతు బొజ్జ ఆంబోతు చందర. రిక్య నాయక. పాల్గొన్నారు.

ALSO READ : 

Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకంకు వారే అర్హులు..

ఎంపిక విధానం ఇలా..!

Mega Plan 2050 : త్వరలో వైబ్రంట్‌ తెలంగాణ 2050, మెగా మాస్టర్‌ ప్లాన్‌.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..!