అమరవీరుల ఆశయాలను సాధించాలి

అమరవీరుల ఆశయాలను సాధించాలి

మిర్యాలగూడ టౌన్, మన సాక్షి:

అమరవీరుల ఆశయాలను సాధించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అన్నారు.శనివారం స్థానిక అమరవీరుల స్మారక భవనంలో వీర తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ పోలేబోయిన గోపయ్య 13 వ వర్థంతి సభలో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడరు.కామ్రేడ్ గోపయ్య రావులపెంట గ్రామానికి 5 పర్యాయాలు సర్పంచిగా ఎన్నికై గ్రామానికి ఎనలేని కృషి చేశారన్నారు.

 

గోపయ్య సతీమణి కూడా వారి అడుగుజాడల్లోనే నడుచుకుంటూ 1 పర్యాయం సర్పంచిగా ఎన్నికై గ్రామానికి కృషి చేశారని గుర్తు చేశారు.సీపీఎం పార్టీ తాళుకా నాయకుడిగా,వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడిగా ఆనాడు జరిగిన అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పనిచేస్తూ అనేక ఒడిదొడుకులు ఎదురైనా కడవరకు ఎర్రజెండా నీడలోనే పనిచేశారని, అలాంటి నాయకులను నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు.

 

ఎవరికి ఏ ఆపద వచ్చినా గోపయ్య వెంటనే స్పందించి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కృషి చేసేవారన్నారు.నేటి పాలకులు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అటువంటి అమరవీరుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఉద్యమాలు చేయాలని ముఖ్యం నేటి యువత అలాంటి నాయకుల ఆశయాల కోసం కంకణబద్దులై పోరాటాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమసమాజ నిర్మాణం కోసం కోసం ఎర్రజెండా నీడలో సోషలిజం స్థాపన లక్ష్యంగా ముందు సాగాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జగదీష్ చంద్ర,రవినాయక్, మల్లు గౌతంరెడ్డి,రాగిరెడ్డి మంగారెడ్డి, భావండ్ల పాండు,లక్ష్మీనారాయణ, వెంకట్ రెడ్డి,పతాని శ్రీను,బాబు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

 

కామ్రేడ్ పోలబోయిన గోపయ్యకు ఘన నివాళులు

వేములపల్లి :

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాజీ సర్పంచ్ కామ్రేడ్ పోలబోయిన గోపయ్య 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శనివారం మండల కేంద్రంలోని రావులపెంట గ్రామంలో అమరవీరుల స్తూపం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఐద్య జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మీ మాట్లాడుతూ… గోపయ్య సేవలు ఎనలేనివి అని కొనియాడారు.

 

గ్రామానికి 5 పర్యాయాలు సర్పంచిగా ఎన్నికై గ్రామానికి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు.సిపిఎం పార్టీ తాళకా నాయకుడిగా, వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడుగా ఆనాడు జరిగిన అనేక ఉద్యమాలు ప్రత్యేకంగా పనిచేస్తూ అనేక ఒడిదొకులు ఎదురైనా కడవరకు ఎర్రజెండా నీడలో పనిచేశారని సిపిఎం గ్రామ శాఖ అధ్యక్షులు కందుల నాగిరెడ్డి స్మరించుకున్నారు.గ్రామ ప్రజలకు ఏ సమస్య వచ్చిన ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కృషి చేసేవారన్నారు.

 

గ్రామానికి పోలబోయిన గోపయ్య చేసిన సేవలు మర్చిపోలేనివని వినయ్ గౌడ్ అన్నారు.గ్రామ ప్రజలు సర్పంచిగా 35 సంవత్సరాలు గ్రామ ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి కామ్రేడ్ పోలబోయిన గోపయ్యకే దక్కిందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శ్రీనివాస్ రెడ్డి,పెద్ద బిక్షం,పురాణపు సైదులు,పోలబోయిన ఏడుకొండలు,మూసి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.