Breaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా
Alumni : నాటి స్మృతులు మధురానుభూతుల.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.!
నాటి స్మృతులు మరిచిపోలేని మధురానుభూతులు అని సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు అన్నారు.

Alumni : నాటి స్మృతులు మధురానుభూతుల.. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.!
సూర్యాపేట, మనసాక్షి:
నాటి స్మృతులు మరిచిపోలేని మధురానుభూతులు అని సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000 విద్యా సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు అన్నారు. ఆదివారం పట్టణంలోని పబ్లిక్ క్లబ్ లో 25 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గురువులను సత్కరించి, మృతి చెందిన విద్యార్థులు, ఉపాద్యాయులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గురువులు ఆశీర్వాదించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పుల్లయ్య, సోమేశ్వరరావు, సుదర్శన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చారి, అహల్య, గోపారపు రాజు, విద్యార్థులు 11వ వార్డు కౌన్సిలర్ ఎల్గూరి ఇందిరా వీరయ్య గౌడ్,నీ రుడు రమేష్, సాంబా చారి, శైలేందర్, సతీష్ కుమార్, సాంబ చారి,మీరా వలీ, గోపి, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.









