పుట్టగానే వదిలించుకున్నావా అమ్మా…!!

పుట్టగానే వదిలించుకున్నావా అమ్మా…!!

రాయలసీమ బ్యూరో, మన సాక్షి:

రామకుప్పం మండలం చెల్దిగానిపల్లిలో శనివారం ఉదయం ఓ పసి కందు రోడ్డు ప్రక్కన చెత్తకుప్పలో కన్పించింది. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ ను వదిలేసి వెళ్లినట్లు పరిస్థితిని బట్టి తెలుస్తోంది. స్థానికులు కథనం మేరకు శనివారం ఉదయం 9.30 గంటలకు ఓ ఆటోలో ఇద్దరు మహిళలు ఒక వ్యక్తి ఓ పసికందని కుప్పం పలమనేరు జాతీయ రహదారి ప్రక్కన చెత్తలో వదిలివేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు.

 

ఓ తల్లి ఆడబిడ్డ పుట్టిందనే కారణంతో పసికందని రోడ్డు ప్రక్కన వదిలేసి వెళ్లడంతో ఆపసికందు ఆకలి కేకలతో అరుస్తుండగా గుర్తించిన ఆగ్రామ మహిళా సమాఖ్య గ్రూపు సభ్యులు కుప్పం ఐసిడిఎస్ అధికార్లకు సమాచారం ఇచ్చారు. ఆపసికందని ఆరోగ్య పరీక్షలు నిమిత్తం కుప్పం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు అధికారులు వెల్లడి కావాల్సి వుంది