Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Anganwadi : అంగన్వాడి టీచర్లు, వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..!

హైదరాబాద్ , మన సాక్షి ;

తెలంగాణలోని అంగన్వాడి టీచర్లు వర్కర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3989 మినీ అంగన్వాడి కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలోని అంగన్వాడి టీచర్లు వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. 3989 మినీ అంగన్వాడి కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ఏప్రిల్ 30 నాటికి ఉద్యోగ విరమణ వయసును 65 సంవత్సరాలుగా నిర్ధారించింది.

 

ఉద్యోగ విరమణ అవకాశం కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తెలంగాణలో 3989 మినీ అంగన్వాడి కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసింది. అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ఏప్రిల్ 30 నాటికి ఉద్యోగ విరమణ వయసుని 65 సంవత్సరాలుగా నిర్ధారించింది.

 

గతంలో ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ఫలాలు అంటూ ఏమీ లేవు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసుని నిర్ధారించి, విరమణ అనంతరం లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి నిర్ణయించింది. అంగన్వాడి టీచర్ కు ఉద్యోగ విరమణ అనంతరం లక్ష రూపాయలు, హెల్పర్లకు 50 వేల రూపాయల సహాయం అందించడం ఉన్నట్లు ప్రభుత్వం తెలియజేసింది.

 

ఆసరా పెన్షన్లు : 

అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ అనంతరం ఆసరా పెన్షన్లు కూడా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా అంగన్వాడీలకు అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ఉన్నదని ,బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నది.

 

ALSO READ : 

  1. ఆపదలో ఓ నిరుపేద కుటుంబం.. దాతల కోసం ఎదురుచూపు..!
  2. నల్లగొండ  : సింగిల్ ఇన్వెస్ట్.. డబుల్ ప్రాఫిట్, రియల్ వ్యాపారం మాటున ఘరానా మోసం..!
  3. మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!
  4. Chennai : దారి తప్పిన కుమార్తెను.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!
  5. Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)

 

అంగన్వాడీలకు ఉద్యోగ విరమణ అనంతరం సహాయం నిర్ధారించడంతోపాటు మినీ అంగన్వాడీలను ప్రధాన కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు.

 

తెలంగాణలో ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు నెలకు 13,650రూపాయలు, మినీ అంగన్వాడీ టీచర్లకు 7800 రూపాయలు, హెల్పర్లకు 7800 రూపాయలు ఇస్తున్నారు . ప్రస్తుతం మినీ అంగన్వాడి లు కూడా కావడం వల్ల వారికి కూడా వేతనాలు పెరగనున్నాయి.

 

మరిన్ని వార్తలు