మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!

మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు జానారెడ్డి కుమారుడు , టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు.

మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి దరఖాస్తు..!

హైదరాబాద్ , మన సాక్షి :

మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ కోసం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుందూరు జానారెడ్డి కుమారుడు , టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి శుక్రవారం దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి గాను టికెట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే.

 

ALSO READ : 

  1. Chennai : దారి తప్పిన కుమార్తెను.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!
  2. Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)
  3. Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
  4. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్

 

దరఖాస్తుల స్వీకరణ శుక్రవారంతో ముగియనున్నదు. కాగా గాంధీభవన్ లో రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.

 


ఇదిలా ఉండగా జానారెడ్డి చిన్న కుమారుడు కుందూరు జై వీర్ రెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన స్థానమైన నాగార్జునసాగర్ నుంచి చిన్న కుమారుడు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా మిర్యాలగూడ టికెట్ కోసం కుందూరు రఘువీర్ రెడ్డి (జానారెడ్డి పెద్ద కుమారుడు ) దరఖాస్తు చేసుకున్నారు. రఘువీర్ రెడ్డి దరఖాస్తు కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ సహా ఉన్నారు.