Chennai : దారి తప్పిన కుమార్తెను.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!

Chennai : దారి తప్పిన కుమార్తెను.. ఆ తండ్రి ఏం చేశాడంటే..!

మనసాక్షి , వెబ్ డెస్క్ :

దారి తప్పిన పిల్లలు ఉంటే తల్లిదండ్రులకు ఎంతో మనో వేదన ఉంటుంది . వారిని దారికి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా దారికి రాకుంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి సంఘటన చెన్నైలోని తిరుచ్చి జిల్లాలో చోటుచేసుకుంది. దారి తప్పిన కుమార్తెను ఆ తండ్రి ఏం చేశాడో..? తెలుసుకుందాం..

 

తిరుచ్చి జిల్లాలో ముగ్గురు భర్తలను విడిచి జులాయిగా కుమార్తె తిరుగుతుంది. దానిని తట్టుకోలేక తండ్రి ఆమెను హత్య చేశాడు. తిరుచ్చి జిల్లాలోని దేవారంపట్టి సమీపంలోని అటవీ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది ఓ మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేసారు.

 

ALSO READ ;

1. Allu Arjun : తగ్గేదేలే.. సుకుమార్ ని పట్టుకుని ఏడ్చిన బన్నీ .. ! (వీడియో వైరల్)

2. Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?

3. RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!

4. భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి

 

ఊరకరై గ్రామానికి చెందిన అరివలగన్ కుమార్తె ప్రియాంకగా గుర్తించారు. ఆమె ముగ్గురిని వివాహం చేసుకొని ముగ్గురిని కూడా విడిచిపెట్టి జూలాయిగా తిరుగుతుండడంతో.. తండ్రి ఆగ్రహించి హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది.