భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్తాడని భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రి పదవి ఇచ్చారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

భయంతోనే ఆయనకు మంత్రి పదవి : రేవంత్ రెడ్డి

వికారాబాద్ /తాండూరు , మనసాక్షి:

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేర్తాడని భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన మంత్రి పదవి ఇచ్చారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదవులు పంచుకునేందుకు, కార్యకర్తలను మోసం చేసేందుకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఒకటయ్యారని ఆయన విమర్శించారు.

 

నిన్నటి వరకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జుట్లు పట్టుకున్న వారు ఇప్పుడు పదవులు పంచుకున్నారని అన్నారు. తాండూరులో కాంగ్రెస్ కార్యకర్తలు త్యాగం చేసి ఎమ్మెల్యేని గెలిపిస్తే ప్రజలను మోసం చేసి టిఆర్ఎస్ కు అమ్ముడుపోయారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు, మన్నెగూడ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.

 

యాభై శాతం బీసీ కులాలకు మూడు ప్రధాన పదవులు, 50 శాతం కేసీఆర్ కులాలకు నాలుగు స్థానాలు! ? మాదిగ బిడ్డల్లో ఎవరికీ మంత్రివర్గంలోకి వచ్చే అవకాశం లేదు. మనం BRS కి ఎందుకు ఓటు వేస్తాము?  ఒక్క ముదిరాజ్ అభ్యర్థికి కూడా కేసీఆర్ టికెట్ ఇవ్వలేదని అత్యధిక సంఖ్యలో ఉన్న ముదిరాజులు రాష్ట్ర ప్రజలు కారా అని ప్రశ్నించారు. ఈటెలపై కోపంతో ఉంటే మరో ముదిరాజ్ నాయకుడికి ఇచ్చి ఉండాల్సిందని.. కానీ జాతి మొత్తాన్ని శత్రువుగా చూడటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ..

 

ALSO READ : 

  1. Jana Reddy : జానారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారా..? మరి సాగర్ నుంచి ఎవరు పోటీ..?
  2. RRR : ఆర్ఆర్ఆర్ కు అవార్డుల్లో సిక్సర్.. ఆరు విభాగాల్లో అవార్డులు..!
  3. మద్యం పై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద విద్యా,వైద్యం పై లేదు – మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి
  4. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్

 

గత ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకొని కొడంగల్ లో తనను ఓడించారని, తిరిగి మరోసారి దౌర్జన్యాలు చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కొడంగల్ లోనే తాను నిలబడతానని స్పష్టం చేశారు.

 

అసదుద్దీన్ ఓవైసీ, కేసీఆర్ ,నరేంద్ర మోడీ ఆ ముగ్గురు ఒకటేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆ ముగ్గురిలో ఓటు ఎవరికి వేసిన వారికి వేసినట్లే అన్నారు. ఆ ముగ్గురు తోడు దొంగలు, గూడుపుఠాని అందుకే మునుగోడులో కమ్యూనిస్టుల మద్దతు తీసుకున్న కేసీఆర్ మోడీతో జోడి కోసం ఎప్పుడు వారిని బయటకు విసిరారని విమర్శించారు.

 

కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్లతోనే ఎంతోమంది ఉద్యోగాలు సాధించాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 26వ తేదీన చేవెళ్ల ప్రజాగర్జన సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొంటారని చెప్పారు.