మద్యం పై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద విద్యా,వైద్యం పై లేదు – మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి

మద్యం పై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద విద్యా,వైద్యం పై లేదు – మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి

చర్ల, మనసాక్షి:

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రవేశ పెట్టిన సంక్షేమ,అభివృద్ది పధకాల తోనే రానున్న ఎన్నికల్లో మరోసారి కేంద్రం లోను,తెలంగాణ రాష్ట్రంలో నూ డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ,మాజీ ఎమ్మెల్యే కుంజ సత్యవతి అన్నారు.

చర్ల మండలకేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలంలో మంగళ వారం చర్ల మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అథిది గా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి మాట్లాడుతూ..  లిక్కర్ స్కామ్,భూ మాఫీయా,ఇసుక మాఫియా,డ్రగ్స్ మాఫీయా కు పాల్పడుతున్న అధికార పార్టీ అవినీతి ని ప్రజలు గమనిస్తున్నారని దళిత బందు,బీసీ బందు వంటి అమలు కాని హామీ లతో దళితులు, బీసీలు,నిరుద్యోగులు బీ ఆర్ ఎస్ పార్టీకి దూరం అయ్యారని అన్నారు..

 

ALSO READ ; 

  1. మళ్లీ వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమే : ముఖ్యమంత్రి కేసీఆర్
  2. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
  3. దుబ్బాక : మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో కట్టెలు, రాళ్లతో దాడి.. 9 మంది అరెస్ట్..!
  4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!
  5. Syber Crime : సైబర్ నేరస్తుల డీప్ ఫేక్ మాయాజాలం.. ఫోటోలు, వీడియోలు గొంతును క్షణాల్లో మార్చేస్తారు..! ఇలా జాగ్రత్తలు పాటించాలి..!
  6. ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ

 

ఇప్పుడు గృహ లక్ష్మి పేరుతో మరో పధకం తీసుకువచ్చి పనికి మాలిన షరత్ లతో అసలయిన లబ్దిదారులకు అన్యాయం చేస్తున్నారని,నిరుపేదలకు రేషన్ కార్డులు,ఉచిత బియ్యం ఇవ్వలేని దీన స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు..

 

మద్యం పై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ద విద్యా, వైద్యం పై లేదని,దేశంలో మోడి పాలన ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉంటే కేసీఆర్ పాలన అవినీతి కి ఆదర్శం గా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గంకో కన్వీనర్ బిట్రగుంట క్రాంతి కుమార్,జిల్లా కార్యవర్గ సభ్యులు సంతపురి సురేష్, మండల ప్రధాన కార్యదర్శి ఎడవల్లి శేషగిరి రావు,వెంబడి హరినాథ్,కార్యదర్శి కొండేటి చంద్ర శేఖర్,ముత్యాల తాతాజీ,చిడెం జగన్,పగడాల శ్రీధర్,గుమ్మల వేణు,కారం సురేశ్,మేడి స్వరూప్,సోడి ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.