ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ

ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో ఎంపిక అయిన పి డి నాగేంద్రమ్మ

దమ్మపేట , మనసాక్షి

దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల పి డి కుర్సం నాగేంద్రమ్మ ఈ నెల హైదరాబాద్ జింఖానా మైదానంలో జరిగిన ఆలిండియా సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ 100మీ. విభాగంలో రాష్ట్ర స్థాయి లో మొదటి స్థానంలో నిలిచి జాతీయ స్థాయి లో పంజాబ్ రాష్ట్రం చండీఘర్ లో జరిగే పోటీలకు ఎంపిక అయినారు .

 

ఈ సందర్భంగా ఆమెను ఈ రోజు పాఠశాల లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం తొలేం వెంకటేశ్వర్లుమాట్లాడుతూ మన రాష్ట్రంలోనేఅంకంపాలెం బాలికల సాధించటం గర్వకారణంగా ఉందని తెలిపారు.పట్టుదల ఖుషి అనే రెండు అంశాలు ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు.

 

వార్డెన్ సౌజన్య , ఉపాధ్యాయులు రమణ , కాంతమ్మ, కృష్ణ ప్రసాద్ , రామకృష్ణ , వీరభద్రమ్ ,రవి , శ్రీను గోపాలరావు లత వాణి దేవి , రజని , సత్యవతి ,రమేష్ , రవిశంకర్ , కృష్ణ చరణ్ , నాగమణి కుమారి , తదితరులు పాల్గొన్నారు.

 

MOST READ : 

  1. TELANGANA :  బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్
  2. TSRTC : మహిళ ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ప్రత్యేక బస్సు సౌకర్యం..!
  3. మిర్యాలగూడ : ఏటీఎంలు చోరీ చేసేందుకు వచ్చిన వ్యక్తి అరెస్టు..!
  4. TSRTC : ఒక్క క్లిక్ తో.. మీరు ప్రయాణించాల్సిన బస్సు ఎక్కడుందో తెలుసుకోవచ్చు.. అది ఎలానో చూద్దాం..!